ఎడ్యుకేషన్

ఎంజెపి గురుకులంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

కమలాపూర్, తెలంగాణ గళం: సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సంద ర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని కమలాపూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిభా ఫూలే బాలుర పాఠశాలలో శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా పాఠశాల ప్రాంగణం…

By · · Updated

Share this article
ఎంజెపి గురుకులంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

కమలాపూర్, తెలంగాణ గళం:

సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సంద ర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని కమలాపూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిభా ఫూలే బాలుర పాఠశాలలో శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా పాఠశాల ప్రాంగణం నుండి కార్యక్రమ సభాస్థలి వరకు ఎన్సిసి విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ తో ఉపాధ్యాయులకు ఘనంగా స్వాగతం పలికారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ తాడూరి రవీందర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి ఉపాధ్యాయలతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం  జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ గొప్పతనాన్ని వివరిస్తూ, విద్యారంగానికి ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలను వివరించారు. విద్యార్థులు విద్యాభ్యాస దశలో క్రమశిక్షణ అలవర్చుకొని సమాజంలో అంతే క్రమశిక్షణగా పౌరులుగా ఎదగాలని కోరారు. ప్రతి విద్యార్థికి తల్లి తండ్రి తర్వాత గురువే ప్రాధాన్యత ఉన్నది కాబట్టి గురువులను కూడా తల్లిదండ్రులతో సమానంగా గౌరవించాలని తెలిపారు. విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపడానికి ఉపాధ్యాయులకు కొవ్వొత్తుల వెలుగునిస్తూ తాను కరుగుతున్నారని అన్నారు. ప్రస్తుత సమాజంలో ఉపాధ్యాయుల పట్ల జరుగుతున్న పరిస్థితులను రూపుమాపి ఉపాధ్యాయులకు సమాజంలో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ తాడూరి రవీందర్, ఏటీపీ శ్రీవాణి, బి డబ్ల్యు త్రివేణి, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Tags: