ఎడ్యుకేషన్

పరకాల జూనియర్ కళాశాలలో ఘనంగా కాళోజీ జయంతి

తెలంగాణ గళం, సెప్టెంబర్ 9 పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మంజుల, అధ్యాపక బృందం, విద్యార్థులు కలిసి కాళోజీ చిత్ర…

By · · Updated

Share this article
పరకాల జూనియర్ కళాశాలలో ఘనంగా కాళోజీ జయంతి

తెలంగాణ గళం, సెప్టెంబర్ 9

పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మంజుల, అధ్యాపక బృందం, విద్యార్థులు కలిసి కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం ప్రిన్సిపల్ మంజుల మాట్లాడుతూ ఒక సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అని నిరూపించిన ప్రజాకవి కాళోజీ అని కొనియాడారు. తన కలం ద్వారా అన్యాయాన్ని, అక్రమాన్ని ఎదిరించిన గొప్ప వ్యక్తి కాళోజీ అని అన్నారు. విద్యార్థులు కాళోజీని ఆదర్శంగా తీసుకొని అన్యాయాన్ని ఎదిరించి న్యాయం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags: