తెలంగాణ

సహారా బాధితుల ఆందోళన అంబేద్కర్ విగ్రహం వద్ద రాస్తారోకో

హనుమకొండ, తెలంగాణ గళం, సెప్టెంబర్ 26: హనుమకొండ: దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది సహారా బాధితులకు దాదాపు రూ.2 లక్షల కోట్ల డిపాజిట్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్…

By · · Updated

Share this article
సహారా బాధితుల ఆందోళన అంబేద్కర్ విగ్రహం వద్ద రాస్తారోకో

హనుమకొండ, తెలంగాణ గళం, సెప్టెంబర్ 26:

హనుమకొండ: దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది సహారా బాధితులకు దాదాపు రూ.2 లక్షల కోట్ల డిపాజిట్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్ లో బాధితులు సమావేశమయ్యారు.

అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. రాజ్యాంగ నిర్మాతకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గత 6 ఏళ్లుగా ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, కేంద్ర హోంశాఖ, ఆర్థిక శాఖ మంత్రులు, సుప్రీంకోర్టుకు వినతులు ఇచ్చినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, కోర్టు వాయిదాల వల్ల 10 వేలకు పైగా ఖాతాదారులు, వందలాది ఏజెంట్లు మరణించారని, చాలామంది మానసికంగా కృంగిపోయారని అన్నారు.

2023 జూన్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆన్ లైన్ పోర్టల్ ద్వారా చెల్లిస్తామని ప్రకటించి 40 నెలలైనా కేవలం రూ.9,200 కోట్లు మాత్రమే చెల్లించి కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. 2012 నుంచి సెబీ-సహారా కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని, డిపాజిట్ల కోసం పిల్లల పెళ్లిళ్లు, చదువులు, ఇళ్ల నిర్మాణాలు, వైద్య ఖర్చులు ఆగిపోయాయని వాపోయారు.

సహారా ఆస్తులను వేలం వేసి బాధితులకు న్యాయం చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు వి.బాలయ్య, ఉపాధ్యక్షులు రవీందర్ రెడ్డి, గుండేటి కుమార్, ప్రధాన కార్యదర్శి ఎం.నరేష్, రాము, నరసయ్య, సఫియా, విజయ, చందు తదితరులు పాల్గొన్నారు.

Tags: