తెలంగాణ

రూ.2.95 కోట్లతో మార్కెట్‌ యార్డులో నూతన భవనాలు

  మెట్‌పల్లి,అక్టోబర్ 07,తెలంగాణ:    మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో రూ.2 కోట్ల 95 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన కార్యాలయ భవనం, కమర్షియల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి…

By · · Updated

Share this article
రూ.2.95 కోట్లతో మార్కెట్‌ యార్డులో నూతన భవనాలు

 

మెట్‌పల్లి,అక్టోబర్ 07,తెలంగాణ: 

 

మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో రూ.2 కోట్ల 95 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన కార్యాలయ భవనం, కమర్షియల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్ బుధవారం ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మార్కెట్‌ యార్డులో మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేసి రైతులు, వ్యాపారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నూతన కార్యాలయ భవనం, షాపింగ్‌ కాంప్లెక్స్‌ అందుబాటులోకి రావడంతో మార్కెట్‌ కార్యకలాపాలు మరింత సౌకర్యవంతంగా, సమర్థవంతంగా కొనసాగేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మార్కెట్‌ యార్డులో అవసరమైన వసతులను దశలవారీగా మెరుగుపరుస్తామని పేర్కొన్నారు.

 

కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వెలమ సంక్షేమ సంఘం చైర్మన్‌, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు నందయ్య, టీపీసీసీ డెలిగేట్‌ సుజిత్‌రావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కూన గోవర్ధన్, మున్సిపల్‌ చైర్మన్‌ మైలారపు లింబాద్రి, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రైసుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

 

అలాగే మార్కెట్‌ కమిటీ అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ నాయకులు, వ్యాపారులు, మార్కెట్‌ సిబ్బంది పాల్గొని నూతన భవనాల ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నూతన కార్యాలయ భవనం, కమర్షియల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ అందుబాటులోకి రావడంతో మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు మరింత సౌకర్యాలు సమకూరాయని పలువురు పేర్కొన్నారు.

Tags: