తెలంగాణ

రిమ్స్ ఘటనపై చిన్నారి తండ్రి ఆవేదన

రిమ్స్ ఘటనపై చిన్నారి తండ్రి ఆవేదన   నా బిడ్డను కాపాడలేకపోయాం.. మరో కుటుంబానికి ఇలాంటి పరిస్థితి రాకూడదు   ఉట్నూర్: ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆసుపత్రిలోని NICUలో జరిగిన అగ్ని ప్రమాదంలో తన రెండు రోజ…

By · · Updated

Share this article

రిమ్స్ ఘటనపై చిన్నారి తండ్రి ఆవేదన

 

నా బిడ్డను కాపాడలేకపోయాం.. మరో కుటుంబానికి ఇలాంటి పరిస్థితి రాకూడదు

 

ఉట్నూర్: ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆసుపత్రిలోని NICUలో జరిగిన అగ్ని ప్రమాదంలో తన రెండు రోజుల పసికందును కోల్పోయిన షేక్ తోఫిక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఉట్నూర్ మండలానికి చెందిన షేక్ తోఫిక్ భార్య సమ్రీన్‌కు పుట్టిన చిన్నారి ఘటన సమయంలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోంది.

 

AC నుంచి పొగ వస్తున్న విషయాన్ని తాను ముందుగానే ఆసుపత్రి అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, వెంటనే తగిన చర్యలు తీసుకున్నారా అనే విషయంపై సమగ్ర దర్యాప్తు జరగాలని షేక్ తోఫిక్ కోరారు. ప్రమాదం అనంతరం చిన్నారిని మొదట కేర్ ఆసుపత్రికి, అనంతరం నిర్మల్‌కు తరలించామని, అక్కడి నుంచి నిజామాబాద్‌కు తీసుకెళ్లే సమయంలోనే తన చిన్నారి మృతి చెందిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

 

“నా బిడ్డను తిరిగి తీసుకురాలేను. కానీ ఈ ఘటనపై నిజాలు బయటకు రావాలి. భవిష్యత్తులో మరే తల్లిదండ్రులు తమ పిల్లలను కోల్పోకుండా రిమ్స్‌లో పూర్తి స్థాయి భద్రతా చర్యలు చేపట్టాలి. ప్రమాదానికి కారణాలు, అత్యవసర సమయంలో జరిగిన పరిణామాలపై పారదర్శకంగా దర్యాప్తు జరిపి బాధ్యతను నిర్ధారించాలి” అని షేక్ తోఫిక్ కోరారు.

 

తన కుటుంబానికి జరిగిన నష్టానికి న్యాయం చేయడంతో పాటు, రిమ్స్‌లోని NICU, SNCUలలో అగ్నిమాపక, విద్యుత్ భద్రతా వ్యవస్థలను పూర్తిగా పరిశీలించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Tags: