తెలంగాణ

పరకాల ప్రారంభమై 30 రోజులు సేవలు మాత్రం శూన్యం!

పరకాల ,తెలంగాణ గళం, సెప్టెంబర్ 12 పరకాలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నేడు నిరుపయోగంగా మారింది. ప్రారంభమై 30 రోజులు గడుస్తున్నా వైద్య సేవలు మాత్రం శూన్యంగానే ఉన్నాయ…

By · · Updated

Share this article
పరకాల ప్రారంభమై 30 రోజులు సేవలు మాత్రం శూన్యం!

పరకాల ,తెలంగాణ గళం, సెప్టెంబర్ 12

పరకాలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నేడు నిరుపయోగంగా మారింది. ప్రారంభమై 30 రోజులు గడుస్తున్నా వైద్య సేవలు మాత్రం శూన్యంగానే ఉన్నాయి.

 

భవనం హంగులతో కట్టారు కానీ, లోపల కావాల్సిన కనీస వసతులు మాత్రం లేవు. 

- ఆధునిక వైద్య పరికరాల కొనుగోలుకు నేటి వరకు నిధులు మంజూరు కాలేదు.

- మౌలిక వసతులు, ల్యాబ్ సౌకర్యాలు అసంపూర్తిగా ఉన్నాయి.

దీంతో పాత  ఆసుపత్రిలోనే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి అత్యవసర కేసు వచ్చినా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించాల్సిన దుస్థితి నెలకొంది.

కోట్ల రూపాయలు ఖర్చు చేసి కట్టిన భవనం ప్రజలకు ఉపయోగపడకుండా నిర్మానుష్యంగా ఉండటంపై ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు మంజూరు చేసి, పూర్తి స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు.

100 పడకల ఆస్పత్రి. 0 సేవలు!

 

Tags: