తెలంగాణ

ప్రజ్వల్ ఎఫ్ పి సి ఎల్ పర్వతగిరి పియూ మేనేజర్ గట్టిక మృదుల.

పత్తి ఉత్పత్తిలో రైతులు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.   పర్వతగిరి,అక్టోబర్ 7,తెలంగాణ గళం  బుధవారం రోజు నల్లబెల్లి గ్రామంలో ప్రపంచ పత్తి దినోత్సవం కార్యక్రమం WWF-BCI ప్రాజెక్టులో భాగంగా రైతులతో ప్రజ్వ…

By · · Updated

Share this article
ప్రజ్వల్ ఎఫ్ పి సి ఎల్ పర్వతగిరి పియూ మేనేజర్ గట్టిక మృదుల.

పత్తి ఉత్పత్తిలో రైతులు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.

 

పర్వతగిరి,అక్టోబర్ 7,తెలంగాణ గళం 

బుధవారం రోజు నల్లబెల్లి గ్రామంలో ప్రపంచ పత్తి దినోత్సవం కార్యక్రమం WWF-BCI ప్రాజెక్టులో భాగంగా రైతులతో ప్రజ్వల్ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది.గటిక మృదుల పియు మేనేజర్ మాట్లాడుతూ ఈ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా బుధవారం రోజు జరుపుకుంటారు అదేవిధంగా పత్తి వస్త్ర పరిశ్రమలలో ప్రధానమైనది.

అంతేకాకుండా వైద్య సామాగ్రి,నూనెలు మరియు పశు గ్రాసము లాంటిలో ఈ పత్తి కీలకపాత్ర పోషిస్తుంది. కాబట్టి రైతులు ముఖ్యంగా దీని ద్వారా పరిశోధకులుగా ప్రతి రంగంలో అందించే సహకారాన్ని ప్రపంచవ్యాప్తంగా గౌరవిస్తుంది. అందుకు రైతులు పత్తి ఉత్పత్తిలో చేసే కార్యక్రమంలో నాణ్యమైన పత్తిని అందించాలి కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

రసాయనాలు తగ్గిస్తూ సస్యరక్షణలో భాగంగా సేంద్రీయ వ్యవసాయ సాగు పద్ధతులు పాటించాలి.అందులో భాగంగా వర్మి కంపోస్టు,సిటి కాంపోస్టు,జీవ సంబంధిత కషాయాలు వాడడం వలన నాణ్యమైన పత్తి అందించడంతోపాటు బయోడైవర్సిటీ పెంపొందించడంతోపాటు భవిష్యత్తు తరాలకు మంచి నేల అందించగలము మనిషి జీవనశైలిలో ముఖ్యమైన పాత్రలు మంచి నాణ్యమైన గాలి,నాణ్యమైన తిండి ఆహారము,నివాసము ముఖ్యమని వివరించినారు.

రైతులు నాణ్యమైన పత్తిని ఉత్పత్తి చేయడానికి కొన్ని జాగ్రత్తలు కాలుష్యాన్ని తగ్గిస్తూ,చెత్త, చెదారం,రాకుండా తల వెంట్రుకలు పడకుండా ఏరాలి.రవాణా నిల్వచేసే క్రమంలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి అని తెలియజేయడం జరిగినది.

ఈ కార్యక్రమంలో ప్రజ్వల్ సంస్థ ప్రతినిధులు స్కైలాబ్ బాబు వెంకన్న,బద్రునాయక్,సుజాత, మౌనిక,మమత,సరస్వతి లతోపాటు రైతులు,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.