తెలంగాణ

పరకాలలో ప్రైవేట్ హాస్పిటల్స్, ఆర్ఎంపీల మధ్య కమిషన్ దందా

పరకాల,తెలంగాణ గళం, సెప్టెంబర్ 11 గ్రామాల్లో ప్రాక్టీస్ చేసే కొందరు ఆర్ఎంపీలు రోగులను పరకాలలోని ప్రైవేట్ హాస్పిటల్స్ కు పంపిస్తే వారికి ప్రతి రోగిపై కమిషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం రోగిని పంపి…

By · · Updated

Share this article
పరకాలలో ప్రైవేట్ హాస్పిటల్స్, ఆర్ఎంపీల మధ్య కమిషన్ దందా

పరకాల,తెలంగాణ గళం, సెప్టెంబర్ 11

గ్రామాల్లో ప్రాక్టీస్ చేసే కొందరు ఆర్ఎంపీలు రోగులను పరకాలలోని ప్రైవేట్ హాస్పిటల్స్ కు పంపిస్తే వారికి ప్రతి రోగిపై కమిషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం రోగిని పంపినందుకే కాకుండా రోగికి రాసే మందులు, చేయించే బ్లడ్ టెస్టులు, స్కానింగ్ లపై కూడా 20 నుంచి 30 శాతం వరకు కమిషన్ ముట్టజెబుతున్నట్లు సమాచారం.

 

దీంతో అమాయక రోగులపై అనవసర టెస్టులు, ఖరీదైన మందులు రాసి ఆ భారాన్ని రోగులపై మోపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామీణ ప్రాంత రోగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కొందరు ఆర్ఎంపీలు, ప్రైవేట్ హాస్పిటల్స్ లాభాలు ఆర్జిస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పందించి ఈ కమిషన్ దందాపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Tags: