తెలంగాణ

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి

పరకాల, తెలంగాణ గళం, అక్టోబర్ 07: పరకాల కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సూచించారు. పరక…

By · · Updated

Share this article
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి

పరకాల, తెలంగాణ గళం, అక్టోబర్ 07:

పరకాల కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సూచించారు.

పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయాల్లో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోందని, రైతులు, మహిళలు, యువత, పేదల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వాస్తవాలతో ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు.

బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న అసత్య ప్రచారాలను వాస్తవాలతో తిప్పికొట్టాలని, సోషల్ మీడియా వేదికగా సమర్థవంతంగా కౌంటర్ ఇవ్వాలని సూచించారు. కోఆర్డినేటర్లు సమన్వయంతో పనిచేసి పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

 

 

Tags: