తెలంగాణ

ప్రభుత్వ భూములను కాపాడాలి అక్రమ ఆక్రమణలు, నిర్మాణాలను అడ్డుకోవాలి

సర్వే నంబర్‌ 950లోని భూమిని పరిరక్షించాలి: బీజేపీ   పరకాల తెలంగాణ గళం సెప్టెంబర్ 11:   పరకాల పట్టణంలోని ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీజేపీ…

By · · Updated

Share this article
ప్రభుత్వ భూములను కాపాడాలి  అక్రమ ఆక్రమణలు, నిర్మాణాలను అడ్డుకోవాలి

సర్వే నంబర్‌ 950లోని భూమిని పరిరక్షించాలి: బీజేపీ

 

పరకాల తెలంగాణ గళం సెప్టెంబర్ 11:

 

పరకాల పట్టణంలోని ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పరకాల మున్సిపల్ ఫ్లోర్ లీడర్, 15వ వార్డు కౌన్సిలర్ కుక్కల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

 

ఈ సందర్భంగా కుక్కల విజయ్ కుమార్ మాట్లాడుతూ.. పరకాల పట్టణంలోని హనుమకొండ రోడ్డుకు ఆనుకుని ఉన్న సుమారు 7½ గుంటల ప్రభుత్వ స్థలం, సర్వే నంబర్ 950లోని ప్రభుత్వ భూమిని పరిరక్షించేందుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

 

ప్రభుత్వ భూములను కొందరు వ్యక్తులు ఆక్రమించే అవకాశం ఉన్నందున అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి, ప్రభుత్వ భూమి హద్దులను స్పష్టంగా గుర్తించాలని అన్నారు. 

 

ప్రభుత్వ ఆస్తులు ప్రజలందరికీ చెందుతాయని, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.

సర్వే నంబర్ 950కు సంబంధించిన రెవెన్యూ రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించి ప్రభుత్వ భూమి హద్దులను నిర్ధారించాలని, అవసరమైన చోట ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు “ప్రభుత్వ భూమి – ఆక్రమణ నిషేధం” అనే హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు.

 

ప్రభుత్వ భూముల పరిరక్షణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, ప్రభుత్వ భూములను కాపాడేందుకు బీజేపీ ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి ప్రజా పోరాటం చేపడతామని కుక్కల విజయ్ కుమార్ హెచ్చరించారు.

 

ఈ కార్యక్రమంలో బీజేపీ పరకాల పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్, 9వ వార్డు కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణచారి, 12వ వార్డు కౌన్సిలర్ ఆకుల లావణ్య శ్రీధర్, మాజీ పీఏసీఎస్ వైస్ చైర్మన్ చందుపట్ల రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

మున్సిపల్ ఫ్లోర్ లీడర్, 15వ వార్డు బీజేపీ కౌన్సిలర్

Tags: