తెలంగాణ

పేద కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

పరకాల 10వ వార్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ పరకాల, తెలంగాణ గళం, అక్టోబర్ 07: పరకాల మున్సిపాలిటీ 10వ వార్డులో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకా…

By · · Updated

Share this article
పేద కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

పరకాల 10వ వార్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

పరకాల, తెలంగాణ గళం, అక్టోబర్ 07:

పరకాల మున్సిపాలిటీ 10వ వార్డులో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఆదేశాల మేరకు కౌన్సిలర్ పసుల లావణ్య రమేష్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ పసుల లావణ్య రమేష్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిలిచిపోయిందని, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన కుటుంబాలకు నిరంతర ప్రక్రియలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తున్నట్లు తెలిపారు. దీంతో అర్హులైన పేద కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.

స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు మరింత సులభంగా అందే అవకాశం ఉందన్నారు. 

కార్యక్రమంలో డీటీ సుమన్, ఆర్ఐ దామోదర్, వీఆర్ఏ బిక్షపతి, రేషన్ డీలర్ సాంబశివుడు తదితరులు పాల్గొన్నారు.