పరకాల తెలంగాణ గళం అక్టోబర్ 08:
పరకాల పట్టణంలోని పలు వార్డుల్లో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పర్యటించారు. వార్డుల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, పారిశుధ్య నిర్వహణను అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు.

పనుల పురోగతిపై వివరాలు తెలుసుకుని అవసరమైన సూచనలు చేశారు. పర్యటనలో భాగంగా స్థానిక చిరు వ్యాపారులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పరకాల పట్టణ అభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని, పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పట్టణంలో పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యేకు కాలనీవాసులు అభినందనలు తెలిపారు.






