తెలంగాణ

పరకాల మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం 6అంశాలకు ఏకగ్రీవ ఆమోదం

పరకాల, తెలంగాణ గళం,సెప్టెంబర్ 29: మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హనుమకొండ అదనపు కలెక్టర్ బి. శేషాద్రి, డిప…

By · · Updated

Share this article
పరకాల మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం 6అంశాలకు ఏకగ్రీవ ఆమోదం

పరకాల, తెలంగాణ గళం,సెప్టెంబర్ 29:

మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి హనుమకొండ అదనపు కలెక్టర్ బి. శేషాద్రి, డిప్యూటీ కలెక్టర్ టి. రోహిత్, మున్సిపల్ కమిషనర్ పోతరాజు పవన్, వైస్ చైర్ పర్సన్, వార్డు కౌన్సిలర్లు, అధికారులు హాజరయ్యారు.

 

మున్సిపాలిటీకి సంబంధించిన 6 అంశాలను కౌన్సిల్ ముందు ఉంచగా, సభ్యులు సమగ్రంగా చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. పట్టణంలో మెరుగైన మౌలిక వసతులు, పారిశుధ్య నిర్వహణ, పౌర సేవలపై చర్చించారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు.

Tags: