తెలంగాణ

పరకాల జిల్లా సాధన కోసం బీజేపీ అర్ధనగ్న ర్యాలీ

పరకాల జిల్లా సాధన కోసం బీజేపీ అర్ధనగ్న ర్యాలీ - కేసీఆర్, ధర్మారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు పరకాల,తెలంగాణ గళం, అక్టోబర్ 10: పరకాల: అమరవీరుల గడ్డ పరకాలను జిల్లా కేంద్రంగా ప్రకటించకపోవడాన్ని నిరసిస్త…

By · · Updated

Share this article
పరకాల జిల్లా సాధన కోసం బీజేపీ అర్ధనగ్న ర్యాలీ

పరకాల జిల్లా సాధన కోసం బీజేపీ అర్ధనగ్న ర్యాలీ - కేసీఆర్, ధర్మారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు

పరకాల,తెలంగాణ గళం, అక్టోబర్ 10:

పరకాల: అమరవీరుల గడ్డ పరకాలను జిల్లా కేంద్రంగా ప్రకటించకపోవడాన్ని నిరసిస్తూ శనివారం పరకాల పట్టణంలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో అర్ధనగ్న ర్యాలీ నిర్వహించారు. 

పట్టణంలోని ప్రధాన కూడళ్ల మీదుగా అమరవీరుల స్థూపం ఉన్న అమరధామం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు 'కేసీఆర్ డౌన్ డౌన్', 'చల్లా ధర్మారెడ్డి డౌన్ డౌన్', 'పరకాలకు జిల్లా హోదా కావాలి' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

అనంతరం బీజేపీ నాయకులు డాక్టర్ కాళీ ప్రసాద్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో అత్యధిక త్యాగాలు చేసిన ప్రాంతం పరకాల అని, అలాంటి ప్రాంతాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. జిల్లాల పునర్విభజన సమయంలో పరకాలను అమరవీరుల జిల్లాగా ప్రకటిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు.

మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కూడా పరకాల జిల్లా కోసం ఏనాడూ గళం విప్పలేదని విమర్శించారు. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలను నెరవేర్చేలా పరకాలను జిల్లాగా ప్రకటించే వరకు తమ పోరాటం ఆగదని, అవసరమైతే మరింత ఉధృతంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు, కార్యకర్తలు, యువ మోర్చా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags: