పరకాల ఏరియా ఆసుపత్రిలో 100 పడకల నూతన భవనంలో తొలి శస్త్రచికిత్స విజయవంతం
పరకాల, తెలంగాణ గళం, అక్టోబర్ 09:
పరకాల ఏరియా ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన 100 పడకల భవనంలో ఏర్పాటు చేసిన ఆపరేషన్ థియేటర్‌లో తొలి శస్త్రచికిత్స సేవలు నేడు ప్రారంభమయ్యాయి.
వైద్య బృందం అధిక ప్రమాద గర్భధారణకు సంబంధించిన ప్రసవాన్ని విజయవంతంగా నిర్వహించింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు.
మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వంశీ కృష్ణ పర్యవేక్షణలో గైనకాలజిస్ట్ డాక్టర్ కవిత, డాక్టర్ మౌనిక, అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ నారాయణ రెడ్డి, శిశు వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ తదితర సిబ్బంది ఈ సేవల్లో పాల్గొన్నారు.
నూతన భవనంలో ఓటీ సేవలు ప్రారంభం కావడంతో ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వచ్చింది.






