పరకాల, తెలంగాణ గళం, అక్టోబర్ 06:
పరకాల ఆర్టీసీ డిపోలో జరగనున్న కార్మిక సంఘం ఎన్నికల సందర్భంగా TWU, SWF ఐక్య కూటమి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిపోలోని కార్మికులను, డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్ సిబ్బందిని కలిసి ఐక్య కూటమి మేనిఫెస్టోను వివరించారు. కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, సమస్యల పరిష్కారం కోసం TWU-SWF ఐక్య కూటమి ఎల్లప్పుడూ ముందుంటుందని ఎమ్మెల్యే అన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, కార్మికుల హక్కులను కాపాడేందుకు, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ఐక్య కూటమి కృషి చేస్తుందని తెలిపారు. అందుకే రానున్న ఎన్నికల్లో బాణం గుర్తుకు ఓటు వేసి ఐక్య కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కార్మికులను కోరారు.
ఈ ప్రచార కార్యక్రమంలో TWU, SWF ఐక్య కూటమి నాయకులు, పరకాల డిపో కార్మికులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






