తెలంగాణ

పలువురి మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన మాజీ జడ్పీటీసీ మేడిశెట్టి రాములు

పర్వతగిరి, అక్టోబర్ 01 (తెలంగాణ గళం ప్రతినిధి):  పర్వతగిరి మండల ప్రథమ జడ్పీటీసీ మేడిశెట్టి రాములు గురువారం మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చౌటపల్లి ప్యాక్స్ (PACS) న…

By · · Updated

Share this article
పలువురి మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన మాజీ జడ్పీటీసీ మేడిశెట్టి రాములు

పర్వతగిరి, అక్టోబర్ 01 (తెలంగాణ గళం ప్రతినిధి): 

పర్వతగిరి మండల ప్రథమ జడ్పీటీసీ మేడిశెట్టి రాములు గురువారం మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చౌటపల్లి ప్యాక్స్ (PACS) నూతన చైర్మన్‌గా నియమించిన వడ్లకొండ నివాసి అత్తి కుమారస్వామిని ఆయన స్వగృహంలో మేడిశెట్టి రాములు శాలువాతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లభించిన పదవికి వన్నె తెచ్చేలా, రైతులకు మేలు జరిగేలా పని చేయాలని కోరారు.

మృతుల కుటుంబాలకు పరామర్శ: అనంతరం మండలంలోని దౌలత్ నగర్‌లో ఇటీవల మరణించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఫౌండర్ షేక్ నసీరుద్దీన్ కుటుంబ సభ్యులను రాములు పరామర్శించారు. అలాగే, ఇటీవల మరణించిన సివిల్ కానిస్టేబుల్ ఐలపాక అశోక్ తండ్రి ఐలపాక ఐలయ్య కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని, తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమాల్లో వారి వెంట నాయకులు గోనె సంపత్, మహమ్మద్ సర్వర్, అంజద్ పాష, ఎమ్మార్పీఎస్ (MRPS) నాయకులు ధర్మయ్య, వెంకన్న, శ్రీనివాస్, మహేష్, ఉప్పసామి తదితరులు పాల్గొన్నారు.