ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
పరకాల,తెలంగాణ గళం, సెప్టెంబర్ 27:
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన పాడి గేదెలను పరిశీలించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
ఆత్మకూరు మండలం నాగయ్య పల్లి గ్రామంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన పాడి గేదెలను ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...పాడి గేదెల పెంపకం ద్వారా లబ్ధిదారులు నిరంతర ఆదాయం పొందుతూ తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ప్రతి కుటుంబం ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే లక్ష్యంగా దామెరలో మహిళలతో పరకాల ఇందిరా మహిళా డైరీ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.పాడి గేదెలను సక్రమంగా సంరక్షిస్తూ, పాడి ఉత్పత్తిని పెంచుకొని అదనపు ఆదాయం పొందాలని లబ్ధిదారులకు సూచించారు.






