తెలంగాణ

గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలి

భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యం.. నిమజ్జన వేడుకల్లో అప్రమత్తంగా ఉండాలి*   మద్యం సేవించి పాల్గొంటే కఠిన చర్యలు*  పరకాల ఏసీపీ సతీష్ బాబు, సీఐ ప్రవీణ్ కుమార్ సూచనలు*  పరకాల తెలంగాణ గళం సెప్టెంబర్ 22: గ…

By · · Updated

Share this article
గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలి

భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యం.. నిమజ్జన వేడుకల్లో అప్రమత్తంగా ఉండాలి* 

 మద్యం సేవించి పాల్గొంటే కఠిన చర్యలు* 

పరకాల ఏసీపీ సతీష్ బాబు, సీఐ ప్రవీణ్ కుమార్ సూచనలు* 

పరకాల తెలంగాణ గళం సెప్టెంబర్ 22:

గణపతి నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించాలని పరకాల ఏసీపీ సతీష్ బాబు, సీఐ ప్రవీణ్ కుమార్ సూచించారు. 

మంగళవారం పరకాల పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన సమావేశంలో నిమజ్జన ఏర్పాట్లు, భద్రతా చర్యలపై వారు మాట్లాడారు. గణేష్ ఉత్సవ కమిటీలు, భక్తులు పోలీసుల సూచనలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.

నిమజ్జన ఊరేగింపుల్లో  ప్రజలకు, వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

నిమజ్జన ప్రాంతాల్లో విద్యుత్ వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలని, చెరువులు, కుంటల్లో నీటి లోతు తెలియకుండా దిగవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా చిన్న పిల్లలను ఒంటరిగా నీటి వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా చూసుకోవాలని తెలిపారు.

మద్యం సేవించి నిమజ్జన వేడుకల్లో పాల్గొనడం, అల్లర్లు సృష్టించడం, ఇతరులకు ఇబ్బంది కలిగించడం వంటి చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా ఏదైనా అవాంఛనీయ ఘటన కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

నిమజ్జన వేడుకల సందర్భంగా ప్రజల భద్రత కోసం అవసరమైన అన్ని బందోబస్తు ఏర్పాట్లు చేపట్టామని ఏసీపీ సతీష్ బాబు, సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసులకు సహకరించి నిమజ్జన 

కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

Tags: