తెలంగాణ

నడిరోడ్డుపై యువకుడి ఆత్మహత్య

హనుమకొండలో విషాదం: నడిరోడ్డుపై యువకుడి ఆత్మహత్య హనుమకొండలోని సుబేదారి అటవీ శాఖ కార్యాలయం సమీపంలో మంగళవారం సాయంత్రం ఒక యువకుడు నడిరోడ్డుపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. సాయంత్రం సు…

By · · Updated

Share this article
నడిరోడ్డుపై యువకుడి ఆత్మహత్య

హనుమకొండలో విషాదం: నడిరోడ్డుపై యువకుడి ఆత్మహత్య

హనుమకొండలోని సుబేదారి అటవీ శాఖ కార్యాలయం సమీపంలో మంగళవారం సాయంత్రం ఒక యువకుడు నడిరోడ్డుపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. సాయంత్రం సుమారు 4:30 గంటల సమయంలో రోడ్డు డివైడర్ మధ్యలో ఉన్న చెట్టుకు సదరు యువకుడు ఉరేసుకున్నాడు. నిత్యం వాహనాల రద్దీతో బిజీగా ఉండే ఈ ప్రాంతంలో, ఇంత పెద్ద సంఘటన జరిగినా ఎవరూ గమనించకపోవడం స్థానికులను విస్మయానికి గురిచేసింది. సమాచారం అందుకున్న సుబేదారి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వివరాలు, ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.