తెలంగాణ

మృతుని కుటుంబానికి ఆటో యూనియన్ సభ్యుల ఆర్థిక సాయం

తెలంగాణ గళం /చింతగట్టు (సెప్టెంబర్ 25): హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టు గ్రామానికి చెందిన మాదూరి రమేష్ గత నెల 16-09-2026 రోజున తీవ్ర అనారోగ్యంతో అకాల మరణం చెందారు. రమేష్ మృతితో వారి కుటుం…

By · · Updated

Share this article
మృతుని కుటుంబానికి ఆటో యూనియన్ సభ్యుల ఆర్థిక సాయం

తెలంగాణ గళం /చింతగట్టు (సెప్టెంబర్ 25):

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టు గ్రామానికి చెందిన మాదూరి రమేష్ గత నెల 16-09-2026 రోజున తీవ్ర అనారోగ్యంతో అకాల మరణం చెందారు. రమేష్ మృతితో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.  

విషయం తెలుసుకున్న చింతగట్టు మరియు మునిపల్లి గ్రామాలకు చెందిన ఆటో యూనియన్ నాయకులు, సభ్యులు మానవత్వంతో స్పందించారు. మృతుని నివాసానికి వెళ్ళిన యూనియన్ సభ్యులు, రమేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ వంతు బాధ్యతగా సేకరించిన ఆర్థిక సాయాన్ని అందజేశారు.  

ఈ సందర్భంగా ఆటో యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ... రమేష్ మరణం తమను ఎంతో కలిచివేసిందని, ఆయన కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చింతగట్టు, మునిపల్లి ఆటో యూనియన్ సభ్యులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.  

 

హసన్‌పర్తి మండల రిపోర్టర్: మోడెం సందీప్