పర్వతగిరి, సెప్టెంబర్ 24:
మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల మృతిచెందిన పలువురి కుటుంబాలను పర్వతగిరి మాజీ జడ్పీటీసీ మెడిశెట్టి రాములు గురువారం పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
చౌటపల్లి గ్రామానికి చెందిన తక్కళ్లపెల్లి సమ్మారావు ఇటీవల మృతిచెందగా, ఆయన దశదిన కర్మ కార్యక్రమానికి మెడిశెట్టి రాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా సమ్మారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
అలాగే సోమారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వంగాల రవీందర్ అత్తమ్మ జంగిలి కొమురమ్మ ఇటీవల మరణించడంతో, ఆమె నివాసానికి వెళ్లిన రాములు.. కొమురమ్మ చిత్రపటానికి అంజలి ఘటించారు. శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో చౌటపల్లి సర్పంచ్ మట్టపల్లి వెంకటేశ్వర్ రావు, పిఎసిఎస్ డైరెక్టర్ లింగంపల్లి కుమార్ రావు, మండల మాజీ వైస్ ప్రెసిడెంట్ జూలపల్లి గంగాధర్ రావు, నాయకులు జాటోతు శ్రీనివాస్, మేచినేని మాధవ రావు, జూలపల్లి సురేందర్ రావు, గొనె సంపత్, కంటెం ఏకాంతం, వర్ధినేని భూపాల్ రావు, మెడిశెట్టి సుధాకర్, అక్కల రమేష్ తదితరులు పాల్గొన్నారు.





