మంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్ (పాత మంచిర్యాల)లో గల అతి పురాతనమైన శ్రీ రామాలయం–శివాలయం–భక్త ఆంజనేయ స్వామి దేవస్థానం ప్రాంగణంలో దాదాపు రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, రామాలయం వంటి పవిత్రమైన దేవస్థాన ప్రాంగణంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని, ప్రజల అవసరాలకు అనుగుణంగా నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనంతరం కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తయారు చేసిన మట్టి వినాయక విగ్రహాలను ఎమ్మెల్యే శ్రీ ప్రేమ్ సాగర్ రావు గారు భక్తులకు స్వయంగా పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహదపడే మట్టి వినాయక విగ్రహాలను ప్రజలు ఉపయోగించేలా ప్రోత్సహించడం ఎంతో అభినందనీయమని ఆయన కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, స్థానిక కార్పొరేటర్ శ్రీ తూముల నరేష్ గారు, డివిజన్ నాయకులు మరియు ప్రజలు కలిసి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారిని ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సల్ల మహేష్, తదితరులతో పాటు వివిధ కార్పొరేటర్లు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, మార్కెట్ డైరెక్టర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, పార్టీ కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు






