వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతులనే పూజించాలని కోరుతూ, శుక్రవారం మంచిర్యాల జిల్లా కుమ్మర సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ మేయర్ ధరణి మధుకర్ మరియు మున్సిపల్ కమిషనర్ అన్వేష్లను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మున్సిపల్ అధికారులకు మట్టి గణపతి ప్రతిమలను బహుకరించగా, పర్యావరణ పరిరక్షణలో భాగంగా పోల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేస్తామని మేయర్, కమిషనర్లు సానుకూలంగా హామీ ఇస్తూ సంఘం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంగాధరి తిరుపతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు నాంపల్లి శ్రీనివాస్, జిల్లా నాయకులు శనిగారపు తిరుపతి, గంగాధరి గంగన్న, కొడిమ్యాల ధర్మయ్య, సర్జన లింగమూర్తి, కటికనపల్లి సంతోష్, వేనంకి సంపత్ తదితరులు పాల్గొన్నారు






