తెలంగాణ

​మంచిర్యాలలో బ్యాంకు ఉద్యోగుల భారీ నిరసన ర్యాలీ... ఐదు రోజుల బ్యాంకింగ్‌ను వెంటనే అమలు చేయాలి

  ​మంచిర్యాలలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బ్యాంకు ఉద్యోగులు, అధికారులు ఐక్యంగా భారీ ప్రదర్శన నిర్వహించారు. స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెడ్డి కా…

By · · Updated

Share this article
​మంచిర్యాలలో బ్యాంకు ఉద్యోగుల భారీ నిరసన ర్యాలీ... ఐదు రోజుల బ్యాంకింగ్‌ను వెంటనే అమలు చేయాలి

 

​మంచిర్యాలలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బ్యాంకు ఉద్యోగులు, అధికారులు ఐక్యంగా భారీ ప్రదర్శన నిర్వహించారు. స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెడ్డి కాలనీ శాఖ నుండి ప్రారంభమైన ఈ కవాతులో వివిధ బ్యాంకులకు చెందిన సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐదు రోజుల బ్యాంకింగ్‌ను తక్షణమే అమలు చేయాలని, పెరుగుతున్న పని భారాన్ని తగ్గించేందుకు ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లాభాల ఆధారిత ప్రోత్సాహకాల వివక్షను అరికట్టాలని నినాదాలు చేస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థకు సేవలందిస్తున్న ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని నాయకులు కోరారు.

​ఈ నిరసన కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ మంచిర్యాల ప్రాంతీయ కార్యదర్శి కె. శ్రీనివాస్ ఆధ్వర్యంలో అధికారుల సంఘం ప్రాంతీయ కార్యదర్శి వెంకటేష్, ఏజీఎస్ సతీష్, ఓబీసీ నాయకులు ఆర్.ఎస్. బిల్లా, సత్యనారాయణ, యూనియన్ బ్యాంక్ ప్రాంతీయ కార్యదర్శి వసంత కుమార్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ప్రాంతీయ కార్యదర్శి రాము సురేష్, డీసీసీబీ బలరాజు తదితరులు పాల్గొని ఉద్యోగుల ఐక్యతను చాటారు. ఉద్యోగుల హక్కులు మరియు మెరుగైన పని పరిస్థితుల కోసం అన్ని సంఘాలు ఐక్యంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాన్ని కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు

Tags: