మంచిర్యాల నియోజకవర్గం, దండేపల్లి మండలంలోని రెబ్బెనపల్లి హరిజన మత్స్య శాఖ సొసైటీ ఎన్నికల్లో నూతనంగా విజయం సాధించిన అధ్యక్షులు మొదంపల్లి లింగయ్య, ఉపాధ్యక్షులు కుశానపల్లి రాజం, ప్రధాన కార్యదర్శి కుశానపల్లి నర్సయ్య, మరియు డైరెక్టర్లు రాజయ్య, రాజలింగు తదితరులు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో విజయపథంలో నిలిచిన నూతన కార్యవర్గ సభ్యులందరికీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు హార్దిక శుభాకాంక్షలు తెలిపి, మత్స్యకారుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసానిచ్చారు.
ఈ అభినందన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, మాజీ సర్పంచ్ మరియు పలువురు గ్రామ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. నాయకులు, కార్యకర్తల సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో గ్రామాభివృద్ధి మరియు మత్స్యకారుల ఉపాధి అవకాశాల మెరుగుదలపై చర్చలు జరిపారు






