మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని కార్యాలయ సిబ్బందికి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్, మున్సిపల్ కమిషనర్ జి. అన్వేష్‌తో కలిసి సిబ్బందికి మట్టి వినాయకులను అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ మరియు రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమయ్యే ప్రమాదం ఉందని, అందువల్ల పర్యావరణానికి ఎటువంటి హాని చేయని మట్టి వినాయక విగ్రహాలను వినియోగించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సుదమల్ల హరికృష్ణ, అడిషనల్ కమిషనర్ రాజు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు






