తెలంగాణ

మంచిర్యాల జిల్లాలో పర్యటించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ క్రిష్ణ

​ మంచిర్యాల జిల్లాలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పర్యటించారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ మంతెన జగన్మోహన్రావు ఆధ్వర్యంలో ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహించగా.. ఇందారం చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కా…

By · · Updated

Share this article
మంచిర్యాల జిల్లాలో పర్యటించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ క్రిష్ణ

​

మంచిర్యాల జిల్లాలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పర్యటించారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ మంతెన జగన్మోహన్రావు ఆధ్వర్యంలో ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహించగా.. ఇందారం చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ముందుగా శ్రీరాంపూర్ చౌరస్తాలోని సింగరేణి కార్మికుడి విగ్రహానికి ఎంపీ పూలమాలలు వేశారు. ఆ తర్వాత సీసీసీ కార్నర్‌లో కాంగ్రెస్ శ్రేణులు ఎంపీ గడ్డం వంశీకృష్ణను గజమాలతో సత్కరించాయి. అనంతరం మంచిర్యాల ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహాలకు, రైల్వే స్టేషన్ ముందున్న కాకా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంతెన జగన్మోహన్రావుతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

​ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ప్రజలు ఓడించినా ఆ తండ్రి కొడుకులకు బుద్ధి రాలేదని, ఇంకా యువతను రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలనుకుంటున్నారని తీవ్రంగా మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరు చెప్పి కేసీఆర్ ఫ్యామిలీ రాష్ట్రాన్ని దోచుకుందని ఆరోపించారు. గ్లాబోలిన్ సంస్థతో కుమ్మక్కై విద్యార్థుల మృతికి కేటీఆర్ కారణమయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వని కేసీఆర్ కుటుంబం, ఒక్కొక్కరూ ఒక్కో ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా TOMCOM సంస్థ ద్వారా మంత్రి వివేక్ వెంకటస్వామి ముందుకెళ్తున్నారని తెలిపారు. రాముడి పేరు చెప్పి బీజేపీ పార్టీ రాజకీయాలు చేస్తోందని విమర్శించిన ఎంపీ.. మంచిర్యాల నియోజకవర్గంలో ఎంపీ లాడ్స్ నుంచి కోటి 50 లక్షల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, కాకా స్ఫూర్తితో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతానని స్పష్టం చేశారు

Tags: