తెలంగాణ

మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును కలిసిన స్పందన కుటుంబ సభ్యులు

అమెరికాలో ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లి, మెరుగైన చికిత్స అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చిన లగిశెట్టి స్పందన మరియు ఆమె తల్లిదండ్రులు మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారిని ఈరోజు…

By · · Updated

Share this article
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును కలిసిన స్పందన కుటుంబ సభ్యులు

అమెరికాలో ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లి, మెరుగైన చికిత్స అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చిన లగిశెట్టి స్పందన మరియు ఆమె తల్లిదండ్రులు మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారిని ఈరోజు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ పట్టణానికి చెందిన లగిశెట్టి శ్రీనివాస్ కుమార్తె స్పందన MS చదువు నిమిత్తం చికాగో వెళ్లగా, మే 31, 2026 న మెట్రో స్టేషన్‌లో ప్రమాదవశాత్తు కిందపడి తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వెంటనే స్పందించి, తల్లిదండ్రులకు పాస్‌పోర్ట్, వీసా త్వరితగతిన మంజూరయ్యేలా CMO అధికారులతో మాట్లాడి జూలై 2న అమెరికాకు పంపడమే కాకుండా, విమాన టికెట్లు మరియు ఇతర ఖర్చుల నిమిత్తం రూ. 3,00,000 ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబానికి భరోసానిచ్చారు.

​ఆపదలో ఉన్న తమ కుటుంబాన్ని ఆదుకుని ఆపన్నహస్తం అందించిన ఎమ్మెల్యే మానవత్వానికి స్పందన కుటుంబ సభ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ భేటీ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, కార్పొరేటర్ ఎంబాడి కుమారస్వామి, టీపీసీసీ సభ్యులు, నస్పూర్ పట్టణ ఇంఛార్జి నూకల రమేష్, మరియు నాయకులు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు

Tags: