తెలంగాణ

మద్యం మత్తులో బైక్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి

తెలంగాణ గళం/హసన్పర్తి ,(సెప్టెంబర్ 26): మద్యం మత్తులో అతివేగంగా బైక్ నడిపిన ఓ వ్యక్తి.. ఉదయం పూట సరదాగా వాకింగ్‌కు వెళ్లిన ఓ ప్రాణాన్ని బలితీసుకున్నాడు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం వరంగల్ ఖిలా వరంగల్ మండలం…

By · · Updated

Share this article
మద్యం మత్తులో బైక్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి

తెలంగాణ గళం/హసన్పర్తి ,(సెప్టెంబర్ 26):

మద్యం మత్తులో అతివేగంగా బైక్ నడిపిన ఓ వ్యక్తి.. ఉదయం పూట సరదాగా వాకింగ్‌కు వెళ్లిన ఓ ప్రాణాన్ని బలితీసుకున్నాడు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం వరంగల్ ఖిలా వరంగల్ మండలం 39వ డివిజన్ పరిధిలో చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. 39వ డివిజన్‌కు చెందిన బత్తుల కిషన్ శనివారం (సెప్టెంబర్ 26) ఉదయం జన్మభూమి జంక్షన్ రోడ్డుపై వాకింగ్ చేస్తున్నారు. ఇదే సమయంలో మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి తన టూ వీలర్‌ను అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి కిషన్‌ను బలంగా ఢీకొట్టాడు.ఈ ప్రమాదంలో కిషన్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం (MGM) ఆసుపత్రికి తరలించారు. ఉదయం లేవగానే జరిగిన ఈ ప్రమాదంతో కిషన్ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.