*మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమ పూజ*
పరకాల, తెలంగాణ గళం, సెప్టెంబర్ 22
పరకాల: పట్టణంలోని మున్నూరు కాపు సంఘం వినాయక మండపంలో మంగళవారం కుంకుమ పూజను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
బీజేపీ రాష్ట్ర నాయకులు, ప్రముఖ వైద్యులు డా. సిరంగి సంతోష్ కుమార్ హాజరై మహిళలకు చీరలు బహుకరించి సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడి భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆకుల లక్ష్మణ్, మెంతుల సురేష్, మేకల కిరణ్, ఆకుల శ్రీకాంత్, ఆకుల వెంకటేష్, ఆకుల రాకేష్, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.





