తెలంగాణ

ఆకుల వాడలో కొలువుదీరిన గణనాథుడు

పరకాల తెలంగాణ గళం, సెప్టెంబర్ 15 : పరకాల:వినాయక చవితి పర్వదినాన పరకాల పట్టణంలోని ఆకుల వాడలో గణనాథుడు భక్తిశ్రద్ధలతో కొలువుదీరాడు. మొదటి రోజు పూజా కార్యక్రమంలో ఆకుల సుకన్య, లక్ష్మణ్, సాత్విక, విగ్నే…

By · · Updated

Share this article
ఆకుల వాడలో కొలువుదీరిన గణనాథుడు

పరకాల తెలంగాణ గళం, సెప్టెంబర్ 15 :

పరకాల:వినాయక చవితి పర్వదినాన పరకాల పట్టణంలోని ఆకుల వాడలో గణనాథుడు భక్తిశ్రద్ధలతో కొలువుదీరాడు.

మొదటి రోజు పూజా కార్యక్రమంలో ఆకుల సుకన్య, లక్ష్మణ్, సాత్విక, విగ్నేష్ కుటుంబ సభ్యులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.పండితుల మంత్రోచ్ఛారణల నడుమ గణపతికి , పత్రి పూజ ఘనంగా జరిగింది.

ఆకుల వాడ యువకులు మండపాన్ని రంగురంగుల పూలతో, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. చుట్టుపక్కల కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

వినాయక చవితి నుండి నిమజ్జనం వరకు ప్రతిరోజూ పూజా కార్యక్రమాలు, భజనలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Tags: