కమలాపూర్ మండల కేంద్రంలో ఆదివారం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క111వ జయంతి ఉత్సవాలను కమలాపూర్ పట్టణ పద్మశాలి యూత్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణ పద్మశాలి యూత్ అధ్యక్షుడు ఆడెపు శ్రీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో స్వాతంత్ర ఉద్యమంలో తన వంతు పాత్ర పోషిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసి తెలంగాణ ఉద్యమం కోసం తన మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన మహనీయుడు అని అదేవిధంగా తెలంగాణ ఉద్యమం కోసం తన ఇంటిని ఆస్తిని అంతా అంకితం చేయడం ప్రజా హక్కుల కోసం సామాజిక న్యాయం కోసం బీసీ కుల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారన్నారు ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘం అధ్యక్షుడు బైరి జనార్ధన్ పద్మశాలి పట్టణ కుల సంఘం అధ్యక్షుడు బైరి దశరథం, కమలాపూర్ పట్టణ పద్మశాలి యూత్ ప్రధాన కార్యదర్శి మార్గం చైతన్య కుమార్,యూత్ ఉపాధ్యక్షుడు తుమ్మ రాజేష్, క్యాషియర్ చెనుమల్ల శ్రీకాంత్ ,కార్యదర్శిలు చేరాలా సాయికిరణ్ ఆడేపు వినయ్ డైరెక్టర్లు ఉడుత సురేష్, బూర రాజు, గాజుల అరుణ్, చెనుమల్ల రంజిత్ తుమ్మ రఘుపతి, చందనాల నాగరాజ్. బైరి వెంకటరమణ సహకార సంఘం డైరెక్టర్లు చేరాలా సారంగం, చేరాలా వెంకట్రాజ్యం , మాజీ వార్డ్ మెంబర్లు వావిలాల మురళి, బైరి రాజేష్ ,వెల్ది రాఘవులు ,ఆడెపు సాంబయ్య, చేరాల కిషన్, మార్త విజయ్, చేనేత కార్మికులు చేనేత కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కమలాపూర్ లో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ111వ జయంతి
కమలాపూర్ మండల కేంద్రంలో ఆదివారం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క111వ జయంతి ఉత్సవాలను కమలాపూర్ పట్టణ పద్మశాలి యూత్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహి…
By తెలంగాణ గళం · · Updated
Share this article






