తెలంగాణ

భారీ వర్షాలకు నిలిచిన నీరు కాల్వను క్లియర్ చేసిన మున్సిపల్ సిబ్బంది

పరకాల తెలంగాణ గళం సెప్టెంబర్ 25 పరకాల మున్సిపాలిటీ 10వ వార్డు పరిధిలోని ఆర్టీసీ డిపో సమీపంలో భారీ వర్షాల కారణంగా నీరు నిలిచిపోయి ప్రజలకు ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి నెలకొంది.  రహదారి పక్కన నీరు భారీ…

By · · Updated

Share this article
భారీ వర్షాలకు నిలిచిన నీరు కాల్వను క్లియర్ చేసిన మున్సిపల్ సిబ్బంది

పరకాల తెలంగాణ గళం సెప్టెంబర్ 25

పరకాల మున్సిపాలిటీ 10వ వార్డు పరిధిలోని ఆర్టీసీ డిపో సమీపంలో భారీ వర్షాల కారణంగా నీరు నిలిచిపోయి ప్రజలకు ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి నెలకొంది. 

రహదారి పక్కన నీరు భారీగా నిల్వ ఉండటంతో ఆ ప్రాంతం సముద్రాన్ని తలపించేలా మారింది.

దీంతో సమస్యను గుర్తించిన వార్డు కౌన్సిలర్ పసుల లావణ్య రమేష్ వెంటనే స్పందించారు. గౌరవ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు, మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునిల్ సహకారంతో జేసీబీని ఏర్పాటు చేసి కాల్వలో పేరుకుపోయిన చెత్తాచెదారం, మట్టి తదితర వ్యర్థాలను తొలగించి కాల్వను పూర్తిగా క్లియర్ చేయించారు.

మున్సిపల్ సిబ్బంది ప్రత్యేకంగా శ్రమించి కాల్వలో పేరుకుపోయిన చెత్తను తొలగించడంతో వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టారు. దీంతో ప్రస్తుతం ఆ ప్రాంతంలో నీరు నిల్వ ఉండకుండా పరిస్థితి మెరుగుపడింది. వర్షాల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ వెంకట్ రెడ్డి, జవాన్ కిషోర్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags: