తెలంగాణ

కళాకారుల సంక్షేమమే మా ధ్యేయం.. కళా రక్షణే మన కర్తవ్యం

హసన్పర్తి/తెలంగాణ గళం,(సెప్టెంబర్ 27):   కళామతల్లి సేవలో.. కళాకారులకు అరుదైన గౌరవం..   ఈగ మల్లేశం ఈ రోజు హైదరాబాద్ లోని ప్రసిద్ధ రవీంద్రభారతి వేదికగా తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, సంకీర్త…

By · · Updated

Share this article
కళాకారుల సంక్షేమమే మా ధ్యేయం.. కళా రక్షణే మన కర్తవ్యం

హసన్పర్తి/తెలంగాణ గళం,(సెప్టెంబర్ 27):

 

కళామతల్లి సేవలో.. కళాకారులకు అరుదైన గౌరవం..

 

ఈగ మల్లేశం ఈ రోజు హైదరాబాద్ లోని ప్రసిద్ధ రవీంద్రభారతి వేదికగా తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, సంకీర్తన కల్చరల్ సొసైటీ మరియు ఎస్.ఎన్ మ్యూజిక్ అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన సంకీర్తన 14వ ఎస్.ఎన్ మ్యూజిక్ 22వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఉభయ తెలుగు రాష్ట్రాల కళాకారుల సంక్షేమ మండలి అధ్యక్షులు మరియు కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ శ్రీ ఈగ మల్లేశం గారు.

ఈ సందర్భంగా కళారంగానికి మరియు సమాజానికి శ్రీ ఈగ మల్లేశం గారు అందిస్తున్న విశేష సేవలను కొనియాడుతూ, నిర్వాహకులు వారిని వేదికపై అపూర్వంగా సత్కరించి సాంప్రదాయబద్ధంగా శాలువా కప్పి, పూలమాలతో ప్రత్యేక కిరీటధారణతో అత్యంత వైభవంగా సత్కరించి, *"సంకీర్తన జీవిత సాఫల్య పురస్కారాన్ని"* అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓరుగల్లు, వరంగల్ గడ్డ మన కళామతల్లికి పుట్టినిల్లు. ఎందరో మహానుభావులు, వీరులు, అద్భుతమైన కళాకారులను అందించిన ఈ నేల సంస్కృతికి నిలువుటద్దమని, అలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతం నుండి వచ్చిన నాకు, ఈ రోజు రవీంద్రభారతి వేదికపై *"సంకీర్తన జీవిత సాఫల్య పురస్కారం"* మరియు ఈ అపూర్వ సత్కారం దక్కడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్న ఈ గౌరవం కళామతల్లి సేవలో నా బాధ్యతను మరింత పెంచిందని ఆయన అన్నారు.

తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను, లలిత కళలను కాపాడుకుంటూ, భావితరాలకు అందించడంలో సంకీర్తన కల్చరల్ సొసైటీ మరియు ఎస్.ఎన్. మ్యూజిక్ అకాడమీ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. కళాకారులను ప్రోత్సహించడం ద్వారానే సమాజంలో సాంస్కృతిక వైభవం వెల్లివిరుస్తుందని ఆయన ఆకాంక్షించారు.

అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని కళాకారులందరికీ సంక్షేమ మండలి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, కళామతల్లి సేవలో తరించే ఇలాంటి సంస్థలను ప్రభుత్వం మరియు సమాజం ఎంతగానో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. కళాకారుడు ఆకలితో అలమటించకూడదని ,వారి కళ సమాజానికి మార్గదర్శకంగా నిలవాలని, సంకీర్తన కల్చరల్ సొసైటీ, ఎస్.ఎన్ మ్యూజిక్ అకాడమీ చేస్తున్న సేవలు ఎంతో స్ఫూర్తిదాయకమైనవని ఇలాంటి సంస్థలను ప్రభుత్వం, సమాజం ప్రతి ఒక్కరూ చేరదీసి ప్రోత్సహించినప్పుడే మన సంస్కృతి సజీవంగా ఉంటుందని కళాకారులను గౌరవించడం అంటే సమాజాన్ని మనం గౌరవించుకోవడమే అని అన్నారు.