తెలంగాణ

గుండమీది శ్రీనివాస్ సేవలు చిరస్మరణీయం

హసన్‌పర్తి, (తెలంగాణ గళం):అక్టోబర్ 4: బీజేపీ నాయకుడు కీర్తిశేషులు గుండమీది శ్రీనివాస్ పార్టీ అభివృద్ధికి అంకితభావంతో సేవలు అందించారని బీజేపీ రాష్ట్ర నాయకులు, 66వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ గురుమూ…

By · · Updated

Share this article
గుండమీది శ్రీనివాస్ సేవలు చిరస్మరణీయం

హసన్‌పర్తి, (తెలంగాణ గళం):అక్టోబర్ 4:

బీజేపీ నాయకుడు కీర్తిశేషులు గుండమీది శ్రీనివాస్ పార్టీ అభివృద్ధికి అంకితభావంతో సేవలు అందించారని బీజేపీ రాష్ట్ర నాయకులు, 66వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ కొనియాడారు. హసన్‌పర్తి మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు మారం తిరుపతి ఆధ్వర్యంలో గుండమీది శ్రీనివాస్ 4వ వర్ధంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గురుమూర్తి శివకుమార్.. పార్టీ నాయకులు, వివిధ పార్టీల ప్రతినిధులు, కుటుంబ సభ్యులతో కలిసి శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి జ్ఞాపకార్థం బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీనివాస్ పార్టీ పట్ల ఎంతో నిబద్ధతతో పనిచేశారని, ఆయన ఏ బాధ్యత అప్పగించినా అంకితభావంతో నిర్వహించేవారని గుర్తుచేసుకున్నారు. శ్రీనివాస్ లేకపోవడం పార్టీకి, కార్యకర్తలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆశయాలు, పార్టీ పట్ల ఉన్న తపనను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మారుపెల్లి రామచంద్రారెడ్డి, పెంబర్తి సర్పంచ్ తాళ్లపెళ్లి కుమారస్వామి, శ్రీనివాస్ కూతురు శ్రీనిజ, కుటుంబ సభ్యులు చంద్రమోహన్, విజయ మోహన్, నాయకులు పెద్ది మహేందర్ రెడ్డి, గంట సత్యం, దాసరి రాజు, చకిలం రాజేశ్వరరావు, చల్లకొండ ప్రభాకర్ రెడ్డి, మనుపటి తిరుపతి, జీల సురేష్ యాదవ్, దాది మధుసూదన్, ఇమ్మడి కరుణాకర్, దాట్ల సునీల్, మట్టెడ సుమన్, ఆర్మీ శ్రీనివాస్, ఆలేటి అశోక్, శివకళ్యాణ్, చెల్పూరి శంకర్, కోయడ రాజు, శీలం బిక్షపతి, సైరి బాలు, శ్రీకాంత్, మోడెమ్ రమేష్, బుర్ర అశోక్, శ్రావణపెల్లి రవీంద్రాచారి, కంబర్కర్ సాయి తదితరులు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ :మోడెం సందీప్