తెలంగాణ

గూడూరులో ఘనంగా ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు.

గూడూరు అక్టోబర్ 10 (తెలంగాణ గళం) : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని శనివారం గూడూరు మండలంలోని ప్రతి గమంలోని ఆడబిడ్డలందరు బతుకమ్మ పండుగలో మొదటిరోజైన ఎంగిలి…

By · · Updated

Share this article
గూడూరులో ఘనంగా ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు.

గూడూరు అక్టోబర్ 10 (తెలంగాణ గళం) : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని శనివారం గూడూరు మండలంలోని ప్రతి గమంలోని ఆడబిడ్డలందరు బతుకమ్మ పండుగలో మొదటిరోజైన ఎంగిలిపూల బతుకమ్మను వివిధ రకాల రంగురంగుల పూలతో అందమైన బతుకమ్మలను తయారు చేశారు. బతుకమ్మలను చుట్టూ చేరి బతుకమ్మ పాటలు పాడుతూ,సంప్రదాయ నృత్యాలతో ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు.ప్రకృతిలో సహజంగా లభించే పూలనే దైవంగాబావించే ఆడబిడ్డల పండుగను మరింత అందంగా తీర్చిదిద్దడానికి స్థానిక గ్రామపంచాయితీల ఆధ్వర్యంలో డీజే,లైటింగ్,తోరణాలతో ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో గ్రామ ఆడబిడ్డలు సంతోషంతో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు

Tags: