తెలంగాణ

గుడుంబా పై పోలీస్ ల ఉక్కుపాదం.

గూడూరు అక్టోబర్ 1 (తెలంగాణ గళం): గూడూరు మండలంలోని రాములు తండా,చిర్రకుంట తండా గ్రామాల్లో గురువారం రోజున పోలీసులు గుడుంబాపై తనిఖీ నిర్యహించారు ఉదయం 5:30 గంటల నుంచి 7:30 గంటల వరకు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్…

By · · Updated

Share this article
గుడుంబా పై పోలీస్ ల ఉక్కుపాదం.

గూడూరు అక్టోబర్ 1 (తెలంగాణ గళం): గూడూరు మండలంలోని రాములు తండా,చిర్రకుంట తండా గ్రామాల్లో గురువారం రోజున పోలీసులు గుడుంబాపై తనిఖీ నిర్యహించారు ఉదయం 5:30 గంటల నుంచి 7:30 గంటల వరకు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుమారు 40 మంది పోలీసు సిబ్బంది పాల్గొని రెండు గ్రామాల్లోని సుమారు 200 ఇళ్లను సందర్శించి అక్రమ మద్యం తయారీ నిల్వపై నిర్వహించిన తనిఖీల్లో 35 లీటర్ల అక్రమ మద్యం (గుడుంబా) సుమారు 700 లీటర్ల బెల్లం వాష్ గుర్తించి నిబంధనల ప్రకారం స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు.ప్రజలతో నేరుగా మాట్లాడారు గ్రామాల్లో శాంతిభద్రతలను పటిష్టం చేయడం నేరాలను ముందస్తుగా నివారించడం, అక్రమ కార్యకలాపాలను అరికట్టడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Tags: