గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాలు:
కేటీఆర్ సమీక్షలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్
తెలంగాణ గళం/హసన్పర్తి, (సెప్టెంబర్ 26):
రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) శనివారం తెలంగాణ భవన్ నందు ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నాయకులతో కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశంలో వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, బిఆర్ఎస్ నాయకులు అరూరి రమేష్ పాల్గొన్నారు. ఎన్నికల వ్యూహాలు, ఓటర్ల నమోదు ప్రక్రియ మరియు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంపై కేటీఆర్ గారు నాయకులకు దిశానిర్దేశం చేశారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో బిఆర్ఎస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పని చేయాలని ఈ సందర్భంగా నాయకులు తీర్మానించారు.