పరకాల,తెలంగాణ గళం, అక్టోబర్ 06:
భారత జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ వైస్ చైర్మన్ హర్దీప్ సింగ్ గిల్, GHMC కమిషనర్ RV కర్ణన్‌లను ఆల్ ఇండియా సఫాయి మజ్దూర్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ నేతలు సన్మానించారు.
హైదరాబాద్ పర్యటనలో భాగంగా జరిగిన సమావేశంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ వాల్మీకి, జాతీయ కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోదా రామకృష్ణ, సిటీ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ దేవేందర్ చిండాలియా తదితరులు పాల్గొని, సఫాయి కార్మికుల కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వమే నెలసరి వేతనం ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు.






