జాతీయ పతాకావిష్కరణ..
అమరవీరులకు నివాళులు..
పరకాల, తెలంగాణ గళం, సెప్టెంబర్ 17:
తెలంగాణ విమోచన దినోత్సవం, ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ పరకాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో గురువారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్ నాయకత్వంలో జరిగిన కార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పరకాల మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు, రాష్ట్ర నాయకులు డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ పాల్గొన్నారు.
పట్టణంలోని శక్తిస్థల్ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, అనంతరం అమరధామంలో తెలంగాణ విమోచన పోరాట అమరవీరులకు పుష్పాంజలి ఘటించారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

పరకాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని విశ్వకర్మ ధర్మ కుటుంబ సభ్యులకు గాజుల నిరంజన్ శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్లు కుక్కల విజయకుమార్, బెజ్జంకి పూర్ణచారి, ఆకుల లావణ్య శ్రీధర్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ చందుపట్ల రాజేందర్ రెడ్డి, రాష్ట్ర, జిల్లా, పట్టణ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






