హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలానికి చెందిన ప్రముఖ పురోహితులు, విశ్రాంత ఉపాధ్యాయులు గురుదత్ అయ్యగారి జన్మదిన వేడుకలు బుధవారం ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు, భక్తులు, ఆయన శిష్యులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.హసన్‌పర్తి పరిసర ప్రాంతాలలో గురుదత్ అయ్యగారు తెలియని వారుండరనడంలో అతిశయోక్తి లేదు. సమాజం పట్ల ఎంతో సేవాభావం కలిగిన ఆయన, ఉపాధ్యాయుడిగా ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారు.
పురోహితుడిగా తన చేతుల మీదుగా ఎన్నో వివాహాలు, శుభకార్యాలు జరిపించి వేలాది కుటుంబాలలో ఆనందం నింపారు. నిరంతరం లోకకల్యాణం కోసం హోమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయురారోగ్యాలతో ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, సమాజానికి ఆయన సేవలు ఇలాగే కొనసాగాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు.
హసన్‌పర్తి ,మండల రిపోర్టర్ :మోడెమ్ సందీప్ .






