పరకాల, తెలంగాణ గళం, సెప్టెంబర్ 23
దామెర మండలంలో గణేష్ నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లలో భాగంగా గణేష్ నిమజ్జన చెరువులను దామెర ఎస్సై ఈ. వీరభద్రరావు, దామెర తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మి మరియు SRSP DEE అమృత రాజేష్, AEE నరేష్, RI మరియు దామెర గ్రామ సర్పంచ్ కల్పన కృష్ణమూర్తి,అను వారలు పరిశీలించారు.
ఈ సందర్భంగా నిమజ్జన ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు, నీటి పరిస్థితి, వాహనాల రాకపోకలు తదితర అంశాలను పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ప్రజలు మరియు గణేష్ మండప నిర్వాహకులు పోలీసులకు సహకరించి, నిబంధనలు పాటిస్తూ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించాలని దామెర ఎస్సై ఈ. వీరభద్రరావు కోరారు.





