తెలంగాణ

గాంధీ నగర్ కాలనీలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

తెలంగాణ గళం (హసన్‌పర్తి)తేదీ: 13 సెప్టెంబర్, 2026 గాంధీ నగర్ కాలనీలో ఈ నెల 14వ తేదీన వినాయక చవితి పండగను పురస్కరించుకుని శ్రీ విఘ్నేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్ఠాపన మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాల…

By · · Updated

Share this article
గాంధీ నగర్ కాలనీలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

తెలంగాణ గళం (హసన్‌పర్తి)తేదీ: 13 సెప్టెంబర్, 2026

గాంధీ నగర్ కాలనీలో ఈ నెల 14వ తేదీన వినాయక చవితి పండగను పురస్కరించుకుని శ్రీ విఘ్నేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్ఠాపన మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు కాలనీ ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు.ఈ సందర్భంగా కాలనీలోని వినాయక మండపం వద్ద ఉదయం 10:00 గంటలకు వేదమంత్రోచ్ఛారణల మధ్య స్వామివారి విగ్రహ ప్రతిష్ఠాపన, తదనంతరం పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. 

ఈ పావన కార్యక్రమంలో గాంధీ నగర్ కాలనీ, చింతగట్టు పరిసర ప్రాంతాల సభ్యులు, కాలనీ పెద్దలు, మహిళలు, యువతీ యువకులు మరియు భక్తులందరూ కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని కోరారు. ఉత్సవాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా ఉత్సవ కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

 

 

రిపోర్టర్ పేరు:- మోడెం సందీప్, హసన్‌పర్తి ప్రతినిధి, తెలంగాణ గళం