తెలంగాణ

ఎస్టీ రిజర్వ్‌మెంట్లను 6% నుండి 10%కి పెంచి నేటికి సరిగ్గా 4 ఏళ్ళు

ఎస్టీ రిజర్వ్‌మెంట్లను 6% నుండి 10%కి పెంచి నేటికి సరిగ్గా 4 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా... వైరా నియోజకవర్గం, జూలూరుపాడు మండలం కేంద్రంలోని కొమ్ముగూడెంలో బీఆర్ఎస్ పార్టీ BRS Party ఆధ్వర్యంలో నిర్వహించిన…

By · · Updated

Share this article
ఎస్టీ రిజర్వ్‌మెంట్లను 6% నుండి 10%కి పెంచి నేటికి సరిగ్గా 4 ఏళ్ళు

ఎస్టీ రిజర్వ్‌మెంట్లను 6% నుండి 10%కి పెంచి నేటికి సరిగ్గా 4 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా... వైరా నియోజకవర్గం, జూలూరుపాడు మండలం కేంద్రంలోని కొమ్ముగూడెంలో బీఆర్ఎస్ పార్టీ BRS Party ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో కాంటెస్టెడ్ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి గారు, వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు గారు పాల్గొని మాట్లాడడం జరిగింది.మా తండాల్లో మా రాజ్యం రావాలని, మా నాయక్ లే మాకు నాయకులు కావాలని ఎన్నో ఏళ్ళు పోరాటం చేసినా ఎవరూ పట్టించుకోలేదు. కానీ, కేసీఆర్ KCR గారు తండాలను, గూడేలను గ్రామపంచాయతీలుగా మార్చి మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు.పోడు భూములకూ పట్టాలు ఇచ్చి, ఎస్టీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి మన పిల్లల భవిష్యత్తుకు బాటలు వేశారు. ఇలా ఎస్టీల అభివృద్ధికి అనేక అద్భుతమైన పథకాలను అందించారు.ఇదే సమయంలో, కాంగ్రెస్ పార్టీ ఎస్టీలకు హామీలిచ్చి, వాటిని అమలు చేయకుండా మోసం చేసిన తీరును ప్రజల ముందు ఎండగట్టడం జరిగింది.బంజారులు, ఆదివాసీలు కేసీఆర్‌ గారిని ఎప్పుడూ గుండెల్లో పెట్టుకోవాలి.మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే గిరిజన, ఆదివాసీలందరికీ నిజమైన న్యాయం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో స్థానిక కొమ్ముగూడెం సర్పంచ్ భూక్యా జ్యోతి, బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు చాపలమడుగు రామ్మూర్తి, యదలపల్లి వీరభద్రం, భూక్యా సేవా, ఉప సర్పంచులు బాదావత్ నరేష్, భూక్యా నవీన్, తాళ్లూరి రామారావు, లకావత్ హేమ్లా, బానోత్ చిన్న, భూక్యా దేవీలాల్, పురస్తపురవు రామకృష్ణ, భూక్యా సాయిని హరీష్, జబ్బర్, భూక్యా జోహార్ లాల్, మాచినేని శేషగిరి రావు, గంగావత్ సాయి కుమార్, గంగావత్ శివ, బోడా హరికృష్ణ, ఈసం వెంకటేష్, మరియు తదితరులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గిరిజన సోదర సోదరీమణులు, అభిమానులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు .

Tags: