తెలంగాణ

గురుకుల బాలికల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు.. దోమల నివారణకు రాత్రివేళ ఫాగింగ్

10వ వార్డులో సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాల ఆవరణలో కౌన్సిలర్ పసుల లావణ్య రమేష్ ఆధ్వర్యంలో ఫాగింగ్ పరకాల తెలంగాణ గళం సెప్టెంబర్ 29: పరకాల పట్టణ శివారు 10వ వార్డు పరిధిలోని సాంఘిక సంక్షేమ బాలిక…

By · · Updated

Share this article
గురుకుల బాలికల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు.. దోమల నివారణకు రాత్రివేళ ఫాగింగ్

10వ వార్డులో సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాల ఆవరణలో కౌన్సిలర్ పసుల లావణ్య రమేష్ ఆధ్వర్యంలో ఫాగింగ్

పరకాల తెలంగాణ గళం సెప్టెంబర్ 29:

పరకాల పట్టణ శివారు 10వ వార్డు పరిధిలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో విద్యార్థులకు దోమల బెడద లేకుండా, దోమకాటు కారణంగా విషజ్వరాలు సంభవించకుండా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఫాగింగ్ నిర్వహించారు. స్థానిక కౌన్సిలర్ పసుల లావణ్య రమేష్ చొరవతో మంగళవారం రాత్రి 7 గంటలకు కళాశాల పరిసరాల్లో ఫాగింగ్ చేయించారు.

విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కళాశాల ఆవరణతో పాటు పరిసర ప్రాంతాల్లో దోమల నివారణకు చర్యలు చేపట్టారు. వర్షాకాలంలో దోమల వ్యాప్తి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ఫాగింగ్ నిర్వహించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, పరకాల మున్సిపాలిటీ జవాన్ సూదమల్ల కిషోర్, మున్సిపాలిటీ సిబ్బంది చెరుకు వేణు, చెరుకు రాజేష్, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags: