పరకాల తెలంగాణ గళం అక్టోబర్ 10:
హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని దక్షిణముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. ప్రకృతిని ఆరాధిస్తూ తమ కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని గౌరమ్మను వేడుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు పరాశరం కిరణ్ కుమారాచార్యులు, ఆలయ కమిటీ సభ్యులు దగ్గు విజేందర్ రావు, దగ్గు రాజేశ్వర్ రావు, దగ్గు రవీందర్ రావు, లక్కం రమేష్, గుండా రామ్మోహన్, పడిదెల భాస్కర్ రావు తదితరులు పాల్గొని బతుకమ్మ వేడుకలను విజయవంతం చేశారు.






