తెలంగాణ

చింతగట్టులో విరిగిపడ్డ తాటిచెట్టు: ఆందోళనలో గీత కార్మికులు

తెలంగాణ గళం/హసన్ పర్తి:(సెప్టెంబర్ 24): హన్మకొండ జిల్లా చింతగట్టు గ్రామంలో బుధవారం (నిన్న) కురిసిన భారీ వర్షాలకు గ్రామంలోని ఒక పెద్ద తాటిచెట్టు విరిగిపడింది. ఈ ప్రమాదంతో స్థానిక గీత కార్మికులకు తీవ్…

By · · Updated

Share this article
చింతగట్టులో విరిగిపడ్డ తాటిచెట్టు: ఆందోళనలో గీత కార్మికులు

తెలంగాణ గళం/హసన్ పర్తి:(సెప్టెంబర్ 24):

హన్మకొండ జిల్లా చింతగట్టు గ్రామంలో బుధవారం (నిన్న) కురిసిన భారీ వర్షాలకు గ్రామంలోని ఒక పెద్ద తాటిచెట్టు విరిగిపడింది. ఈ ప్రమాదంతో స్థానిక గీత కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లింది. జీవనాధారమైన తాటిచెట్టు విరిగిపోవడంతో తమ ఉపాధి దెబ్బతిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయం తెలుసుకున్న గౌడ సంఘం నాయకులు, సభ్యులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కేవలం ప్రకృతి వైపరీత్యాల వల్లే గీత కార్మికులు ఉపాధి కోల్పోయారని, ఈ నష్టం వల్ల వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు.

తాటిచెట్టును నమ్ముకుని బతుకుతున్న గీత కార్మికుడి కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఆర్థికంగా ఆదుకోవాలని గౌడ సంఘం సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నష్టపోయిన కుటుంబానికి తగిన పరిహారం అందించి ప్రభుత్వం అండగా నిలవాలని వారు వేడుకుంటున్నారు