హనుమకొండ/చింతగట్టు:
హనుమకొండ జిల్లా చింతగట్టు గ్రామంలోని గాంధీనగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత తొమ్మిది రోజులుగా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించిన గణపతి నవరాత్రి ఉత్సవాలు నేటితో (గురువారం) ముగిశాయి. నవరాత్రుల పూజలందుకున్న లంబోదరుడి విగ్రహాన్ని ఈరోజు స్థానిక చెరువులో అత్యంత వైభవంగా నిమజ్జనం చేశారు.గాంధీనగర్ యూత్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామంలో భారీ శోభాయాత్రను నిర్వహించారు.
భక్తుల కోలాటాలు, మంగళవాయిద్యాలు, యువకుల నృత్యాలు మరియు "గణపతి బప్పా మోరియా" జై నినాదాల మధ్య శోభాయాత్ర అత్యంత కోలాహలంగా సాగింది. ఉత్సవ కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవ కమిటీ మరియు గ్రామ పెద్దలు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఈ కార్యక్రమంలో గాంధీనగర్ యూత్ అసోసియేషన్ సభ్యులు, గ్రామ యువకులు, మహిళలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





