తెలంగాణగళం, హసన్‌పర్తి, అక్టోబర్ 08:
హనుమకొండ జిల్లా చింతగట్టు గ్రామంలో బొడ్డెమ్మ నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం గ్రామానికి చెందిన 'స్నేహ యూత్' ఆధ్వర్యంలో మహిళలందరికీ ఉచితంగా గాజుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బొడ్డెమ్మ పండుగను పురస్కరించుకుని గ్రామంలోని మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్నేహ యూత్ సభ్యులు గ్రామంలోని మహిళలందరికీ మంగళకరమైన గాజులను అందజేశారు.
గ్రామాల్లో సంస్కృతిని కాపాడుతూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని మహిళలు ఈ సందర్భంగా స్నేహ యూత్ సభ్యులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో స్నేహ యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు, పెద్ద సంఖ్యలో మహిళలు, యువతులు పాల్గొన్నారు.





